సీఎంకు తెలంగాణ సెగ

CM-kiran-kumar-reddyకాకతీయ ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు తెలంగాణ వాదులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బొమ్మకూరు లో తెలంగాణ సెగ తగిలింది. వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఈరోజు సీఎం బొమ్మకూరు రిజర్వాయర్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభాప్రాంతానికి వెళ్తున్న సీఎంను మార్గమధ్యలోనే తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా కాలం వెల్లబుచ్చడం ఏంటని ఆందోళన కారులు సీఎం కాన్వాయ్ ను చుట్టుముట్టారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో సభాప్రాంగాణాన్ని హోరెత్తించారు. అక్కడితో ఆగకుండా సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. దీంతో కాన్వాయ్ లోని పలు పలు వాహానాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు తెలంగాణ వాదులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.