Site icon TeluguMirchi.com

టీ-బిల్లును వెనక్కు పంపండి : సీఎం

kiranటీ-బిల్లును వెనక్కు పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వీకర్ కు నోటీసులు ఇచ్చారు. సభానాయకుడి హోదాలో ఈ నోటీసులు ఇవ్వడం విశేషం. ముసాయిదా బిల్లు తప్పుల తడకగా వున్నందున వెనక్కు పంపాలని స్వీకర్ కు అందజేసిన నోటీసులో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సభా నిబంధన 77ప్రకారం బిల్లు వెనక్కు పంపేందుకు సభలో తీర్మాణం చేయాలని నోటీసులో పేర్కొన్నారు. అటు  సనమండలిలో
బిల్లు వెనక్కి పంపాలని ఛైర్మన్ కు మంత్రి సి.రామచంద్రయ్య నోటీసిచ్చారు.

టీ-బిల్లుపై స్వీకర్ కు సీఎం ఇచ్చిన నోటీసు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. కిరణ్ నిర్ణయాన్ని సీమాంధ్ర నేతలు స్వాగతిస్తుండగా, టీ-నేతలు మండిపడుతున్నారు. స్వీకర్ నోటీసును వ్యతిరేకిస్తూ.. టీ-నేతలు గండ్ర, కేటీఆర్, ఈటేల.. తదితరులు స్వీకర్ కలిశారు.

విభజన తీర్మాణాన్ని వెనక్కి పంపడంపై కిరణ్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో.. ఇటు సమైక్య, అటు సపరేట్ నేతల మధ్య అసలైన యుద్దం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. మరీ.. సభలో ఈ అంశానికి సంబంధించిన తీర్మాణం చేస్తారా.. ? అందుకు టీ-నేతలు సహకరిస్తారా.. ? అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. అసలైన సభాచర్చకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది.. సో.. ప్రజలారా.. నేతల చిత్రవిచిత్ర సన్నివేశాలను తిలకించడానికి రెడీగా వుండండి.. !!

Exit mobile version