ఒరిజినల్ కాదు..అందుకే రిజక్ట్ నోటీసు !

cm kiranముసాయిదా బిల్లు, అసలు బిల్లు ఒక్కటేనన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా స్పష్టం చేయాల్సి ఉందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.  కేంద్ర మంత్రి జైరాం రమేష్ బిల్లుపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాఖ్యలా? అని ప్రశ్నించారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లునే రాష్ట్రపతికి కేంద్రం పంపాలని,ఆ బిల్లునే రాష్ట్ర శాసనసభకు పంపాలని అబిప్రాయపడ్డారు. అందువల్లనే తాను ఇది ఒరిజినల్ బిల్లు కాదని అంటున్నానని,ముసాయిదా బిల్లు అని ఆయన అన్నారు. ఒరిజినల్ బిల్లు కాదు కాబట్టే తాను తిరస్కరణ నోటీసు ఇచ్చానని అన్నారు. అయితే ఈ విషయంలో కిరణ్  అనేక విమర్శలు వస్తున్నాయి. సభలో కిరణ్ ఏడుగంటలు ప్రశంగించాక ఇప్పుడు తిరస్కరణ నోటిసు ఇవ్వడం సరికాదని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.