నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్బంగా ఆర్యోగం ఎలా ఉందని కూడా కేసీఆర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు దాదాపు అయిదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అంటూ సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పని చేయాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఒకరికి ఒకరు ఫోన్‌లు చేసుకోవడం శుభపరిణామం అంటూ తెలుగు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.