మొన్నటి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని భావించిన జనసేన పార్టీకి దారుణమైన పరాజయం ఎదురైంది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్క చోట కూడా గెలవలేక పోయాడు. ఇక పార్టీలో నెం.2గా పేరు దక్కించుకున్న మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా పార్లమెంటు స్థానంకు పోటీ చేసి ఓడిపోయాడు. జనసేనలో కీలక పాత్ర పోషిస్తాడని భావించిన జేడీ లక్ష్మినారాయణ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల కంటే తన సొంత ఛారిటీ సంస్థపై ఎక్కువ దృష్టి పెట్టాడట.
పార్టీ కార్యక్రమాలకు తక్కువ హాజరు అవ్వడంతో పాటు ఆయన సొంత చారిటీ పనులు ఎక్కువ చేస్తున్న కారణంగా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ పక్కకు పెట్టాడు అనే టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఈమద్య కాలంలో నిర్వహించిన రాజకీయ భేటీలు మరియు మీటింగుల్లో లక్ష్మినారాయణ కనిపించడం లేదు. అందుకే ఆయన జనసేనకు మెల్ల మెల్లగా దూరం అవుతున్నట్లుగా టాక్ వస్తుంది. మరి ముందు ముందు జనసేన గాడిలో పడుతుందని భావిస్తున్న వారికి ఈ వార్త ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.