మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు షాక్ ఇచ్చారు. అమరావతి భూ కుంభకోణం కేసులో చంద్రబాబు కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసిలు అందజేసినట్లు సమాచారం. రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేటింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా చంద్రబాబుకు 41 సీఆర్పీసీ కింద నోటీలిచ్చారు.
సీఐడీ విచారణకు హాజరు కావాలంటూ చంద్రబాబును సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ కేసు మరోసారి తెర మీదికి రావడం తెలుగుదేశం నేతల్లో , కార్య కర్హల్లో ఆందోళన పెంచుతుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.