Site icon TeluguMirchi.com

మోడీ పిలుపు ను పాటిద్దాం అంటున్న చిరు

కరోనా మహమ్మారి దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన గాని రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. గత 15 రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపును ఇచ్చారు.

ఏప్రిల్ 5వ తేదీన‌.. 130 కోట్ల మంది ప్ర‌జ‌లు మ‌హాశ‌క్తి జాగ‌ర‌ణ చేయాల‌న్నారు. దేశ ప్ర‌జ‌లు మ‌హాసంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాల‌ను వెలిగించాల‌న్నారు. కేవ‌లం 9 నిమిషాల స‌మ‌యాన్ని కేటాయించాల‌న్నారు. టార్చ్‌లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాల‌న్నారు.

మోదీ పిలుపు కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. జనతా కర్ఫ్యూ మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పలువురు ప్రముఖులు ప్రజలను కోరుతున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ప్రధాన మంత్రి పిలుపును ప్రతి ఒక్కరూ గౌరవించాలని చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘మన ప్రియమత ప్రధాన మంత్రి పిలుపును గౌరవిస్తూ ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా దివ్వెలను వెలిగించి కరోనా వల్ల ఏర్పడిన చీకటిని తరిమికొడదాం. మన దేశం ఒక్కటవుదాం, మనం ఒకరికోసం ఒకరం నిలబడతామని పునరుద్ఘాటిద్దాం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version