తమ్ముడిలో తపన కనబడింది : చిరు

Chiranjeevi-Comments-On-Pawకేంద్ర మంత్రి చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. పవన్ ’జనసేన పార్టీ’పై పెదవి విప్పారు. ఈరోజు (శనివారం) సాయంత్రం చిరు విలేకరులతో మాట్లాడుతూ.. సమాజం కోసం ఏదో చేయాలనే తపన తమ్ముడిలో కనపించిదన్నారు. పార్టీలు ఎవరైనా పెట్టొచ్చని… ఆ హక్కు పవన్ కు కూడా ఉందని చెప్పారు.

ఇక, కాంగ్రెస్ పార్టీపై పవన్ చేసిన కామెంట్స్ పై మాత్రం చిరు కాస్త గట్టిగానే స్పందించారు. 125యేళ్ల చరిత్ర వున్న కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం ఎవరి వల్ల కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు. గతంలోనూ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలుపుతామని చాలా మంది చెప్పారని గుర్తు చేశారు. అయితే, అన్ని పార్టీలు అంగీకరించిన తరువాతే.. కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుందని అన్నారు.

పవన్ పార్టీ పెట్టడం ఆయన వ్యక్తగతమని చిరు అన్నారు. పవన్ కు భాగోద్వేగాలున్నాయని, పార్టీ ద్వారా ఎలా సేవ చేస్తారో చూడాలని చిరంజీవి వ్యాఖ్యానించారు. కాగా, జనసేన పార్టీ విషయంలో పవన్ తనతో ఏమీ మాట్లాడలేదని చిరు చెప్పడం విశేషం. మొత్తంగా పవన్ చిరుపై చేసిన పరోక్ష కామెంట్స్ పై కన్నా, కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఎక్కువగా  స్పందించారు.