Site icon TeluguMirchi.com

కేసీఆర్ ను కలిసిన చిరంజీవి , నాగార్జున

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శనివారం ప్రముఖనటులు చిరంజీవి, నాగార్జున కలిశారు. తెలంగాణ ప్రగతి భవన్‌లో వీరు భేటీ అయ్యారు. హైదరాబాద్ లో వరదలు సృష్టించిన బీభత్సం అందరికీ తెలిసిందే. ఈ వరదల నేపథ్యంలో చాలా మంది టాలీవుడ్ నటీనటులు ప్రభుత్వానికి తమ విరాళం ప్రకటించారు.  

సిఎం రిలీఫ్ ఫండ్‌కు మన హీరోలు చాలా మంది లక్షలు, కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. నాగార్జున రూ.50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇస్తానని తెలిపారు. చిరంజీవి కోటి రూపాయలు ఇస్తామని తెలుపడం జరిగింది. మారి వాటిని ఇచ్చేందుకే కేసీఆర్ ను కలిసారా..లేక తెలంగాణలో థియేటర్స్ ఓపెనింగ్ గురించి మాట్లాడడానికి వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version