పార్టీని పునరుద్ధరించే ఆలోచన లేదట !

chiruకేంద్ర మంత్రి చిరంజీవి మరోసారి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అన్నారు. విభజన అనివార్యం అయితే హైదరాబాద్ ను యూటీ చేయాలని, అలాగే భద్రాచలం ను ఆంద్రకు కలపాలని కోరతామని ఆయన అన్నారు. యూటీ చేసినప్పుడే సీమాంధ్రుల్లో అసంతృప్తి తొలగుతుందని పేర్కొన్నారు.ఇక విభజన బిల్లు పై చర్చ జరగకపోతే సీమాంద్ర కు అన్యాయం జరుగుతుందని అబిప్రాయపడ్డారు. సమైక్యవాదం ముసుగులో లాభం పొందాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయన్నారు. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చిన తర్వాత విభజన నిర్ణయం జరిగిందని,ఇప్పుడు పార్టీల నేతలు ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వల్ల సామాజిక న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందని , ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు.