Site icon TeluguMirchi.com

పవన్ పై చిరు అటాక్.. !!

chiru-fire-on-pkపవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఆయన అన్నయ్య, కేంద్ర మంత్రి చిరంజీవి స్పందించనున్నారు. ఈరోజు (సాయంత్రం) చిరు మీడియా ముందుకు రానున్నారు. శుక్రవారం పవన్ ’జనసేన పార్టీ’ని అధికారికంగా ప్రకటించి దాదాపు రెండు గంటల పాటు ఉద్వేగభరితమైన ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. తన ప్రసంగంలో పవన్ ఎక్కడ అన్నయ్య (చిరు)ని నేరుగా విమర్శించనప్పటికీ.. ’అన్నయకు ఎదురుపడటం నిజంగా నా దౌర్భాగ్యం’, ’ప్రాణం పోయినా అభిమానుల ఆత్మీయతను తాకట్టుపెట్టను’ లాంటి సటైర్స్ పరోక్షంగా చిరుకు తాకి వుంటాయి. ఈ నేపథ్యంలో.. సాయంత్రం జరిగే ప్రెస్ మీట్ చిరంజీవి ఏవిధంగా స్పందిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

’కాంగ్రెస్ హాటావో.. దేశ్ బచావో’ అని పవన్ పిలువునివ్వడం చిరుకు ఇబ్బంది కలిగించే విషయమే. రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర పోషించాలని భావిస్తున్న చిరంజీవికి పవన్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. కాంగ్రెస్ ను దేశం నుండి తరమికొట్టడమే నా జీవిత లక్ష్యమన్నట్లుగా పవన్ ప్రసంగం సాగింది. ఈ నేపథ్యంలో.. పవన్ పై చిరు కౌంటర్ అటాక్ చేసే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ్ముడు పవన్ పై చిరు ఎక్కుపెట్టనున్న విమర్శనా బాణాలు ఎలా వుండబోతున్నాయి…? అసలు పవన్ పర్సనల్ లైఫ్ (లేదా) సినీ జీవితంపై చిరు స్పందిస్తాడా..?? అన్నది ఆసక్తిగా మారింది. ఏదైమైనా.. మెగా బ్రదర్స్ ఇలా.. అటాక్-కౌంటర్ అటాక్ లు ఇచ్చుకోవడం పట్ల ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరీ.. చిరు విమర్శణాబాణాలు పవన్ మరియు ఆయన అభిమానులకు ఏ మేర గుచ్చుకుంటాయో.. తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే..

 

Exit mobile version