Site icon TeluguMirchi.com

చిరంజీవి డౌన్ డౌన్ ..!

chiruహీరో ఉదయ్‌కిరణ్ భౌతికకాయానికి అంత్యక్రియలు ఎర్రగడ్డ స్మశాన వాటికలో పూర్తి అయ్యాయి. ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి చితికి నిప్పు అంటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడికొచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. వీరిలో కొందరు చిరంజీవికి వ్యతిరేకంగా.. చిరంజీవి డౌన్,డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉదయ్‌కిరణ్‌కి ఇండస్ర్టీలో అవకాశాలు రాకుండా అడ్డుకున్నది చిరంజీవి ఫ్యామిలీయేనని వారి వాదన.

అంతకు ముందు మాట్లాడిన ప్రముఖ దర్శకుడు దాసరినారారాయణ రావు కూడా కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయని,అవకాశాలు రాకుండా చేసి అతడి కెరీర్ ను నాశనం చేశాయని దాసరి స్పష్టం చేశారు. కొన్ని శక్తుల వల్ల ఉదయకిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లాడని, అంతవరకూ అవకాశాలతో, హిట్లతో రాణించిన ఉదయ్ కిరణ్ అవకాశాలు లేక ఇబ్బంది పడి చివరకు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు.

Exit mobile version