ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఈరోజు శనివారం ఉదయం కన్నుమూశారు. తెల్లవారు జామున బిపి డౌన్ కావడం తో హాస్పటల్ కు తీసుకెళ్లారు కానీ మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. రేపు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరపనున్నారు. ఈ తరుణంలో రోశయ్య మృతి పట్ల సినీ , రాజకీయ నేతలు స్పందిస్తున్నారు.
కొణిజేటి రోశయ్య మృతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేతగా చిరంజీవి అభివర్ణించారు. రాజకీయ విలువలు, అత్యున్నత సాంప్రదాయాలు కాపాడడంలో ఒక యోగిలా సేవ చేశారన్నారు. ‘రోశయ్య మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నన్ను రాజకీయాల్లోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజా మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య’ అని చిరంజీవి పేర్కొన్నారు.