కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మాట్లాడటం జరిగింది. ఆయనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో పాటు ప్రత్యేక రాజధానిని తెలంగాణకు ఏర్పాటు చేసే విషయమై పరిశీలన జరుగుతుందట. తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఈ ఎత్తుగడ వేస్తున్నట్లుగా ఆయన అనుమానాలు వ్యక్తం చేశాడు.
ఇక ఏపీ రాజధాని అమరావతి కాదు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతి త్వరలోనే తిరుపతి ఏపీ రాజధాని అంటూ ప్రకటన రాబోతుంది. ముంపుకు గురయ్యే రాజధాని ఏపీకి వద్దని అంతా భావిస్తున్నారు. సీఎం జగన్ మరియు కేంద్రం కూడా అమరావతి విషయంలో ఇదే వాదన కలిగి ఉందని చింతామోహన్ అన్నాడు. గత కొంత కాలంగా తిరుపతి రాజధాని అంటూ జరుగుతున్న ప్రచారంకు చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు సీరియస్ నెస్‌ను క్రియేట్ చేశాయి.