కరోనా వైరస్ చైనాలోని వుహాన్లోనే పురుడు పోసుకుందన్న సంగతి అందరికీ తెలిసిందే. రోజుల్లోనే వందల నుంచి వేల మందికి వైరస్ సోకడంతో ప్రభుత్వం ఫిబ్రవరిలో కేవలం 10 రోజుల్లో వెయ్యి పడకల తాత్కాలిక ఆస్పత్రికి సిద్ధం చేసింది. అయితే ఇప్పుడా హాస్పిటల్ ని లాక్ చేశారు
కరోనా వైరస్ కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో వుహాన్లో ఆస్పత్రిని చైనా మూసేసింది . వందల నుంచి వేల మందికి వైరస్ సోకడంతో ప్రభుత్వం ఫిబ్రవరిలో కేవలం 10 రోజుల్లో వెయ్యి పడకల తాత్కాలిక ఆస్పత్రికి సిద్ధం చేసింది. వెంటనే రెండో వెయ్యి పడకల ఆస్పత్రినీ నిర్మించింది. క్వారంటైన్, ఐసోలేషన్ కోసం 14 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టడంతో ఆ హాస్పిటల్ ని లాక్ చేశారు.