Site icon TeluguMirchi.com

చిలకలూరిపేట నవోదయ విద్యాలయలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

చిలకలూరిపేటలోని నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్‌లోదరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్‌ శుక్రవారం తెలిపారు. 5వతరగతి చదువుతున్న బాల,బాలికలు రాబోయే విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్ష-2022కు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నవంబరు 30 దరఖాస్తులకు ఆఖరు తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష 2022 ఏప్రిల్‌ 30న ఉంటుందని, ఇతర వివరాలకు 08647-255233, 9490445622 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Exit mobile version