చిలకలూరిపేటలోని నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్‌లోదరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ శుక్రవారం తెలిపారు. 5వతరగతి చదువుతున్న బాల,బాలికలు రాబోయే విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్ష-2022కు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నవంబరు 30 దరఖాస్తులకు ఆఖరు తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష 2022 ఏప్రిల్ 30న ఉంటుందని, ఇతర వివరాలకు 08647-255233, 9490445622 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.