Site icon TeluguMirchi.com

మోడీ సర్కార్ లేజీ : చిద్దూ ఆరోపణలు


ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేయాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు కొనసాగింపును సమర్థించిన వారిలో తానే తొలివాడినని అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి. చిదంబరం. లాక్‌డౌన్‌ నిర్ణయం సరైనదేని… కాకుంటే పేద ప్రజలకు నగదు పంపిణీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహస్తోందని ఆయన ఆరోపించారు.

‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగం 23 శాతానికి పెరిగింది. రోజూవారీ వేతన శ్రామికుల జీవితం స్తంభించిపోయింది. వారు ఎన్నో ఇక్కట్లకు గురౌతున్నారు. ఇందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీ ఇచ్చిన ప్రకారం పేద శ్రామికులకు ఆర్థికసాయాన్ని అందచేయాలి.’’ అని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version