అనుకూలమో.. ? వ్యతిరేకమో.. ??

chidanbaramపార్లమెంట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ లోక్ సభకు ఇవే ఆఖరు సమావేశాలు. ఈ నేపథ్యంలో.. ముఖ్యమైన బిల్లులను సభలో ఆమోదింపచేసుకోవాలనే పట్టుదలతో వుంది యూపీఏ ప్రభుత్వం. ఇందులో తెలంగాణ బిల్లు కూడా ఒకటి. అయితే, టీ-బిల్లుకు అనుకూలమో, వ్యతిరేకమో ఏదో ఒకటి స్పష్టం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు.

సోమవారం శాస్త్రిభవన్ లో కేంద్రమంత్రులు కమల్ నాథ్, మనీష్ తివారీ, రాజీవ్ శుక్లాలతో కలసి చిదంబరం విలేకరులతో మాట్లాడారు. ’టీ’ని ఇలా ఇంకా నాన్చుతూ పోతే.. 15వ లోక్ సభ ముగిసి, 16వ లోక్ సభ వస్తుంది. తెలంగాణలో 17మంది ఎంపీలు. సీమాంధ్రలో 25మంది ఎంపీలు వున్నారని.. అప్పుడు మళ్లీ మొదటికే వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. ’టీ’కి అనుకూలమో, వ్యతిరేకమో ఏదో ఒకటి సభలో స్పష్టం చేయాలని కోరారు.

అయితే, చిదంబరం చిత్రమైన వ్యాఖ్యలు చూస్తే కాస్త విచిత్రంగానే అనిపిస్తాయి. ఎందుకంటే సొంత పార్టీ నేతలే స్పష్టమైన అధిష్టానంను ఎదురించి ఢిల్లీలో దీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇతర పార్టీలకు చిదంబరం గీతోపదేశం చేయండి విచిత్రం కాకుంటే ఏంటి..?? మొదటి కాంగ్రెస్ కు ’టీ’ కు అనుకూలమో.. ? వ్యతిరేకమో.. ? తేల్చుకోవాలని ప్రతిపక్ష నేతలు సైటర్స్ వేస్తున్నారు. ఇంతకూ.. ’టీ’కు కాంగ్రెస్ అనుకూలమా..?? వ్యతిరేకమా.. ?? ఏమో.. పార్లమెంట్ లోనే స్పష్టమవ్వాలి మరీ………