Site icon TeluguMirchi.com

ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్ లో సంపూర్ణ లొక్డౌన్

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గడ్‌ ముందు వరుసలో ఉంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలు తీవ్రం చేసింది. ఇందులో భాగంగా ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 19 వరకు మొత్తం బంద్‌ చేస్తున్నట్లు బుధవారం ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు పది వేలకు చేరువగా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీవ్ర ఆంక్షలు విధిస్తోంది.

మంగళవారం ఒక్కరోజే ఛత్తీస్‌గడ్‌లో 9,921 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటిలో అత్యధికంగా రాజధాని రాయ్‌పూర్‌లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ వైద్య ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ కట్టడి చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ దశలో రాజధానిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 14 వరకు రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు.

Exit mobile version