పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సీ పై చంద్రబాబు కామెంట్


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సితో తెలుగుదేశానికి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పవన్ పోరాటంలో అర్థం ఉందన్న చంద్రబాబు…, రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తనకు తోచిన విధానంలో పవన్ వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ఉద్దేశం కూడా రాష్ట్రానికి మేలు జరగాలనేనని… శ్వేత పత్రాలు అడిగితే సున్నిత పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఏది అడిగినా ఇచ్చేందుకు మనకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే కేంద్రం ఏం చేసిందనే దానిపై శ్వేతపత్రం బిజేపీనే ఇవ్వాలన్నారు.

ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యా వేత్తలు, సామాజిక, రాజ‌కీయ నాయ‌కులు తదిత‌రుల‌తో జేఎఫ్‌సీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జేఎఫ్‌సీ ఏ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం, వివక్ష లేకుండా ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుందని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే ఆయన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పలువురితో చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్.