Site icon TeluguMirchi.com

చంద్రబాబు లైవ్ చాటింగ్..

CBN-Liveఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కొత్త హైటెక్ పద్దతికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే యువత సోషల్ మీడియా కు ఎక్కువగా మక్కువ చుపెడుతున్నారు. ఎక్కడ చూసిన పేస్ బుక్ , ట్విట్టర్ ఇలా సోషల్ సబంధించిన అన్ని రంగాలలో ముందు ఉంటున్నారు. అయితే ఈలాంటి పద్దతి నే రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయలని భావిస్తున్నాడు చంద్రబాబు..

రాష్ట్ర ప్రజలతో అన్ లైన్ లో లైవ్ చాటింగ్ చేయబోతున్నారు. ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా నేరుగా ప్రజలతో మాట్లాడబోతున్నారు. చంద్రబాబుతో లైవ్ చాట్ చేయాలనుకునే వారు ఈ నెల 16వ తేదీలోగా ఆయా సామాజిక అనుసంధాన వేదికల ద్వారా సలహాలు, సూచనలు, ప్రశ్నలు పంపించాలి. సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల ద్వారా ప్రజలు వాటిని పోస్ట్ చేయాలని సీఎం తన ఫేస్‌బుక్ పేజీలో కోరారు. ఇప్పటికే వేలాది మంది ఈ లైవ్ చాట్ కోసం నమోదు చేసుకున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ఖాతాలున్న వారు ఈ చర్చలో పాల్గొనవచ్చు.

మొత్తానికి ఈ లైవ్ చాట్ కార్యక్రమం సక్సెసయితే, బాబు రాను..రాను అన్ని కార్యక్రమాలు ఆన్లైన్ లోనే చేస్తారేమో..

Exit mobile version