Site icon TeluguMirchi.com

చంద్రబాబు 65వ జన్మదిన వేడుకలు

cbn
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన 65వ జన్మదిన వేడుకను ప్రకాశం జిల్లా చీరాలలోని ఐటీసీ అతిథిగృహంలో నిరాడంబరంగా జరపుకున్నారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

మరో వైపు, పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఅర్ ట్రస్ట్ భవన్ లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసిన పోరాటాలు, ఇతర అంశాలపై చిత్ర ప్రదర్శన ఉంటుందని టీడీపీ మీడియా కమిటీ ఇన్ ఛార్జి ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.

Exit mobile version