ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2019లో జరుగబోతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటి నుండే దృష్టి పెట్టారు. నేడు అసెంబ్లీ కమిటి హాల్లో తెలుగు దేశం పార్టీ శాసనసభ పక్ష భేటీ జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమ నాగిరెడ్డికి సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత ప్రజల్లోకి తెలుగు దేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులు తీసుకు వెళ్లాలని, అలా చేసినట్లయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసం అవుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీని ఆధర్శంగా తీసుకుని, ఆయన్ను ఫాలో అవ్వాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
తాజాగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ ఎన్నికల్లో మోడీ అనుసరించిన వ్యూహం ఒక్కటే, అదే చేసిన అభివృద్దిని ఏకరువు పెట్టడం. ప్రతి బహిరంగ సభలో కూడా మోడీ తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి గొప్పగా చెప్పాయి. అవి ప్రజల్లోకి చేరాయి. అందుకే యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని చంద్రబాబు నాయుడు అన్నారు.
అదే విధంగా మనము కూడా ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే మనం చేస్తున్న అభివృద్ది ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తమ నియోజక వర్గంలో అభివృద్ది గురించి ప్రచారం చేయాలని సూచించారు. 2019పై చంద్రబాబు నాయుడు ఇప్పటి నుండే దృష్టి పెట్టడం కాస్త ఆశ్చర్యంను కలిగిస్తుంది.