Site icon TeluguMirchi.com

చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ వెనుక మర్మం ఏంటి ?


ఎప్పుడో 8ఏళ్ల క్రితం 2010లో జరిగింది. దీనిపై కేసులు రద్దుచేశామని మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఇన్నాళ్లు గడిచాక ఇప్పుడు మళ్లీ కేసులు పెట్టడం ఏమిటి..? సమన్లు, నోటీసులు ఏమీ లేకుండా ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమిటి..? అంటే దీని వెనుక ఉన్నదెవరో వేరేగా చెప్పాల్సిన పనిలేదు.

ఒక ముఖ్యమంత్రికి ఎప్పుడో 8ఏళ్ల క్రితం జరిగిన దానిపై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడం దేశ చరిత్రలో జరిగిందా…? దీనినేమంటారు..? రాజకీయ కక్ష సాధింపు కాదంటారా..? వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుపై 30కేసులు పెట్టించారు జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా..ఏం జరిగింది..? అన్నింటిలో క్లీన్ చిట్ వచ్చింది.ముఖ్యమంత్రి అయ్యాక 26ఎంక్వైరీలు,సభా సంఘాలు వేశాడు.ఏం జరిగింది..? అన్నింటిలో కడిగిన ముత్యంలాగా బైటికొచ్చారు.

బాబ్లీ ప్రాజెక్టు వల్ల గోదావరి జలాలు రాకపోవడానికి కారణం వైఎస్సే. మిగులు జలాలపై హక్కును వదులుకుంటూ లేఖ రాసి కృష్ణా నది ఆయకట్టు రైతులకు మరణ శాసనం రాసిన పాపం వైఎస్ దే. అప్పుడు వైఎస్ పాత్ర ఇప్పుడు బిజెపి పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేయమన్నందుకు, రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయమన్నందుకు, అప్పటి ప్రధాని,ఇప్పటి ప్రధాని ఏపికి ఇచ్చిన హామీలు నెరవేర్చమన్నందుకు చంద్రబాబుపై కక్ష సాధింపునకు దిగింది.

ఎన్డీఏలో టిడిపి ఉన్నప్పుడు చంద్రబాబుకే నోటీసులు రాలేదు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టగానే నాన్ బెయిలబుల్ వారెంట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ‘ఆపరేషన్ గరుడ’ ప్రారంభం అయ్యిందని నెలరోజులుగా అంటున్నారు.సినీ నటుడు శివాజి చెప్పాడు రేపోమాపో నోటీసులు వస్తాయని..ఆయన చెప్పి వారం రోజులు కాలేదు. నిజంగానే ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.

ఈ గరుడలు,గండభేరుండాలు తెలుగుదేశం పార్టీకి,చంద్రబాబుకు కొత్త కాదు. ఆయన జీవితమే పోరాటాల మయం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసమే చంద్రబాబు పోరాటం, ఆరాటం. ప్రజలు అండగా ఉన్నంత కాలం ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు..చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకం.

నీటి కోసం భవిష్యత్తులో యుద్ధాలు జరుగుతాయి అని పెద్దలు అన్నారు. ఆ పరిస్థితి తెలుగువారికి రాకూడదనే మొదటినుంచి జల సంరక్షణను ఒక ఉద్యమంగా చంద్రబాబు తీసుకున్నారు. 9ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘నీరు-మీరు’ ఉద్యమం చేపట్టాం. సాగునీటి సంఘాలు స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. దేవాదుల,నెట్టెంపాడు,బీమా తదితర ఎత్తిపోతల పథకాలన్నీచంద్రబాబు శ్రీకారం చుట్టినవే.

ప్రతిపక్ష నేతగా 10ఏళ్లు మహారాష్ట్ర,కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు సాహసోపేతంగా ఆయా ప్రాంతాలకు నదిలో బోట్లలో వెళ్లి ఫొటోలు తీసి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని బట్టబయలు చేశారు. 23జిల్లాల ప్రయోజనాల కోసం లాఠీదెబ్బలు తిన్నారు, జైలుకు వెళ్లారు. 5రోజులు పోలీసుల నిర్బంధంలో ఉన్నారు.

బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని అప్పుడే హెచ్చరించాం. తెలంగాణలో 6జిల్లాలు (నిజామాబాద్,కరీంనగర్, ఆదిలాబాద్,వరంగల్,నల్గొండ,ఖమ్మం) పరిధిలో 19లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారుతుందని ఆనాడే ఉద్యమాలు చేశాం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే భూమిపూజ,శంకుస్థాపన, పనులు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న నాయకుడు (కెసిఆర్) గాని,ముఖ్యమంత్రి (రాజశేఖర రెడ్డి)గాని బాబ్లీ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు.

అది ప్రాజెక్టు కాదు, చెక్ డ్యామ్ మాత్రమే నని ఒకరు(పొన్నాల లక్ష్మయ్య), దీని సామర్ధ్య్యం 2టిఎంసిలు మాత్రమే నని ఇంకొకరు(వైఎస్), 2.7టిఎంసిలకు ఇంత రాద్దాంతం అవసరమా అని మరొకరు(కెసిఆర్) ఆనాడు రకరకాలుగా మాట్లాడారు. ఒక ప్రాజెక్టు గర్భంలో మరో ప్రాజెక్టు నిర్మించడం అనేది ప్రపంచ చరిత్రలో లేదని ఆనాడే మనం చెప్పాం.బాబ్లీ ప్రాజెక్టు ద్వారా 150టిఎంసిలు వాడుకుంటారని టిడిపి ముందే హెచ్చరించింది.

నాందేడ్ జిల్లావాసుల తాగునీటి అవసరాలకు మాత్రమే అన్నారు. 8వేల హెక్టార్లే సాగు అన్నారు. తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. 2005నుంచి 2010వరకు తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని, అప్పటి ప్రధానిని అనేకమార్లు కలిసి వినతిపత్రాలిచ్చాం.2007లో టిడిపి ఎమ్మెల్యేల బృందం ప్రాజెక్టు సైట్ కు వెళ్తే లాఠీచార్జి చేశారు. డిల్లీలో జంతర్ మంతర వద్ద ధర్నా చేశాం.శాసన సభలో,పార్లమెంట్ లో పోరాడాం.

16.06.2010న ధర్మాబాద్ లో ధర్నాచేశాం.చంద్రబాబుతో సహా 74మంది నాయకులను అరెస్ట్ చేశారు.5రోజులు అక్రమ నిర్బంధం. లాఠీచార్జిలో పలువురు ఎంపిలు,ఎమ్మెల్యేలకు గాయాలు. నానా ఇబ్బందులకు గురిచేశారు. అప్పుడు బలవంతంగా విమానంలో ఎక్కించి హైదరాబాద్ తరలించారు. కేసులను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని అన్నారు.అలాంటిది ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్లు రావడం వెనుక మర్మం ఏంటో అందరికి తెలిసిందే.

రైతుల కోసం ఉద్యమాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిస్తారా..? ఒకసారి కేసులు ఎత్తేశామని మహారాష్ట్ర ప్రకటించాక మళ్లీ తప్పుడు కేసులు బనాయిస్తారా..? నాలుగేళ్లలో కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ది ప్రధాని నరేంద్రమోదికి కంటగింపుగా మారింది. గతంలో గుజరాత్ మోడల్ అనేవారు,ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ మోడల్ అనడం చూసి అక్కసు పట్టలేక పోతున్నారు.

ఈ నెల 23న ప్రకృతి సేద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రసంగించాలని ఐక్యరాజ్యసమితి పంపిన ఆహ్వానం చూసి ప్రధాని నరేంద్రమోది ఈర్ష్యతో రగిలిపోతున్నారు. ఏదో విధంగా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలనే ఈవిధమైన కుతంత్రాలు పన్నుతున్నారు. 23న అమెరికా వెళ్లకుండా చేసేందుకే 21న ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలని తప్పుడు కేసు వేయించి నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేలా చేశారు.

అంతర్జాతీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ట పెరగడం చూసి నరేంద్రమోది,అమిత్ షా తట్టుకోలేక పోతున్నారు. రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే ఎప్పుడో 8ఏళ్ల క్రితం కేసు,అదికూడా ప్రభుత్వం రద్దుచేసిన కేసును తవ్వి తోడుతున్నారు.

అప్పుడు కేసులు లేవని, ఉప సంహరించామని చెప్పి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి తీరా 8ఏళ్ల తరువాత నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేలా చేయడాన్ని ఏమనాలి? ఎలా చూడాలి? నిధులు ఇవ్వకుండా,చట్టం అమలు చేయకుండా,హామీలు నెరవేర్చకుండా చేయడంతో నరేంద్రమోది అక్కసు తీరలేదు.ఏదో విధంగా చంద్రబాబును కేసులలో ఇరికించి రాజకీయ కక్ష సాధించాలని కుట్రలు చేస్తున్నారు. • ఈ మహాకుట్రలో తెరవెనుక కుట్రదారులు,పాత్రధారుల గుట్టు రట్టు అయ్యింది. వీరికి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు.

Exit mobile version