Site icon TeluguMirchi.com

పత్రికా సంపాదకులతో బాబు భేటీ !

nesw-papers-editorsప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్న సంక్షోభ పరిస్థితులపై వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకోవడానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంట్లో భాగంగానే ఈరోజు (శనివారం) వివిధ పత్రికల సంపాదకులతో బాబు తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సుమారు 20మంది పత్రిక సంపాదకులు హాజరైనట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై బాబు సంపాదకులతో చర్చించారని, వాటికి సంబంధించి వారి అభిప్రాయలను సైతం తీసుకున్నారు. రాష్ట్ర విభజనపై తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుంటానని బాబు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విభజన విషయంలో సీమాంధ్రలో చెలరేగిన ఆందోళనలను చల్లార్చేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సంపాదకుల సలహాలు, సూచనలను బాబు అడిగితెలుసుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటనకు ఆ పార్టీ నేతలే కట్టుబడి వుండలేకపోతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై బాబు అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవడాన్ని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్చలు తెదేపాకు రాజకీయంగా కూడా చాలా మేలు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version