జైట్లీతో చంద్రబాబు భేటీ!

babu

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సీమాంధ్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర లోటు బడ్జెట్, రుణ మాఫీ.. తదితర అంశాలను చంద్రబాబు జైట్లీకి సవివరంగా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే, యూపీఏ హయంలో విభజన ప్రకియలో ముఖ్య భూమిక పోషించిన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. సీమాంధ్ర ఆర్థిక పరిస్థితిపై వివరించిన బాబు.. జేట్లీకి పలు విజ్ఞప్తులు చేశారు. ఉత్తరాఖండ్ తరహాలో ఆర్థిక, పారిశ్రామిక ప్రత్యేక ప్యాకేజ్ ను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. 13, 14 ఫైనాన్స్ కమిషన్లలో కూడా సీమాంధ్రకు పెద్దపీట వేయాలని కోరారు. కాగా, చంద్రబాబు ఈరోజు సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.