Site icon TeluguMirchi.com

ప్రధానికి చంద్రబాబు లేఖ

అత్యంత క్లిష్టమైన రాష్ట్రవిభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తోందని, అనాలోచితంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలుగు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోందంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భారతప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖలో పేర్కోన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు అనుకూలంగా 2008 లో ఇచ్చిన లేఖకు ఇప్పటికీ కట్టుబడివుందని, తెలంగాణాకు దాదాపు అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయని, అయితే తెలంగాణా ఏర్పాటు నిర్ణయం లో మాత్రం స్పష్టత లేక పోవటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అశాంతి కి గురయ్యారని ఆయన తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని, నీరు, విద్యుత్, నదీజలాలు తదితర అంశాలలో ఎటువంటి స్పష్టత లేకుండానే తొందరబాటుతో తన  నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించిందని, ఫలితంగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో రగిలిపోతోందని చంద్రబాబు తన లేఖలో ప్రధానికి వివరించారు. సత్వరమే ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని తెలుగు వారందరూ సామరస్యంగా ఉండేలా చొరవ తీసుకోవాలని బాబు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version