జగన్ మోహన్ రెడ్డి కి చంద్రబాబు లేఖ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి , మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. ఏమనంటే ..స్వతంత్ర భారతదేశంలో గిరిజనులెవ్వరూ వారి ప్రగతికి గల అవకాశాలను పోగొట్టుకోకూడదని, దోపిడీకి గురికాకూడదని నాటి రాజ్యాంగ పరిషత్ లో ఒకే ఒక గిరిజన ప్రతినిధి శ్రీ జైపాల్ సింగ్ ముండా పేర్కొన్నారు.

అటువంటి రాజ్యాంగ నిబద్దత ప్రకారం గిరిజనులకు ఎదిగే అవకాశాలను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత, కానీ వైసీపీ ప్రభుత్వానికి అలాంటి నిబద్దత ఏదీ లేదు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వల్ల స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 34 శాతం నుండి 24 శాతానికి తగ్గిపోయి, బీసీలు తమ రాజకీయ సాధికారతను కోల్పోవలసివచ్చింది. ఇక ఇప్పుడు గిరిజనుల వంతు. గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం జనవరి 10, 2000 తేదీన జీవో నెం.3ని తెచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ఆ జీవో ఇప్పుడు అమలు కాకుండా పోయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వంలో ఏ స్పందనా లేదు. గిరిజన ప్రగతి పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ఇప్పటికైనా గిరిజనుల హక్కులను, అవకాశాలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ @AndhraPradeshCM కి లేఖ రాసాను. గిరిజనులకు సమాన అవకాశాలు దక్కేలా నిరంతరం పోరాడుతుంది తెలుగుదేశం. అంటూ బాబు ట్వీట్ చేశారు.