Site icon TeluguMirchi.com

కరెంట్ అధికారులు షాక్ ..చంద్రబాబు గెస్ట్ హౌస్ కు కరెంట్ కట్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కు కరెంట్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉంటున్న గెస్ట్ హౌస్ కు కరెంట్ కట్ చేసారు. ఈ అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు కావాలనే కరెంట్ కట్ చేశారని ఆయన మండిపడ్డారు. కనీసం జనరేటర్ సౌకర్యాన్ని కూడా కల్పించలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీకి తాము కూడా షాకులిస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తీరు దారుణంగా తయారైంది. టీడీపీ నేతలను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం పరిపాటిగా మారిందని, వైసీపీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి ఇలాగె ప్రవర్తిస్తుందని తెలుగు తముళ్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పైనా నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.

Exit mobile version