తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను రేపు నరసరావు పేటలో ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో కోడెల మృతితో శాంతిభద్రతలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో 144 సెక్షన్‌ను పెట్టడం జరిగింది. ఈ విషయమై తెలుగు దేశం పార్టీ మరియు కోడెల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోడెల మృతితో ఆయనకు నివాళ్లు అర్పించేందుకు ఆయన అభిమానులు మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు రాకుండా 144 సెక్షన్ అడ్డుకుంటుందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక వైపు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు అంటూనే మరో వైపు 144 సెక్షన్‌ను విధించడం రాజకీయం చేస్తున్నారు అంటూ బాబు విమర్శలు గుప్పించారు. తమ తప్పును బయట పడకుండా దాచి పెట్టే విషయమై ఇలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.