రూ.5వేలు .. చంద్రబాబు డిమాండ్

‘రాష్ట్రంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అన్నారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పనిచేస్తే గానీ పూటగడవని ఎంతోమంది పేద ప్రజలను ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయి. దిల్లీ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోంది. అలాగే, ఏపీలో కూడా పేదలకు తొలివిడతగా కనీసం రూ.5వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

‘‘మన రాష్ట్రంలో అత్యధికంగా ఒక్క వారంలో వెయ్యి శాతానికి పైగా కరోనా పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పివారిని మరింత సమాయత్తం చేయాలి. భౌతిక దూరం పాటించాలి. మత, రాజకీయపరమైన సదస్సులు వాయిదా వేసుకోవాలి’’ అని సూచించారు.