నోరు జారొద్దు..

ncbn
రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయొద్దని ఏపీ మంత్రులకు చంద్రబాబు సూచించారు. శాసనసభలోని తన ఛాంబర్‌లో మంత్రులతో సమావేశమైన బాబు.. రాజధానిపై నోరు జారడం మంచిది కాదన్నారు. అందరికీ ఉపయోగకరమైన నిర్ణయాన్ని తీసుకుందామని మంత్రులకు సూచించారు. కాగా, శివరామకృష్ణణ్ కమిటీ నివేదికపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వెలుబిచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు, ఏపీ రాజధానిపై నిన్న కేంద్రానికి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చింది పూర్తిస్థాయి నివేదిక కాదని, కొనసాగింపుగా ఇవాళ మరో నివేదిక ఇవ్వనుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని శివరామకృష్ణ కమిటీ ఎక్కడా చేప్పలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సెప్టెంబరు 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో… రాజధాని ఎక్కడ అనే దానిపై ఓ స్పష్టత రావచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది కేవలం సూచనలు మాత్రమేనని మంత్రి యనమల అన్నారు. రాజధాని ఎక్కడ అన్నది రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు.