Site icon TeluguMirchi.com

పోలవరం విషయంలో కేసీఆర్‌ జోక్యం ఎందుకు?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఇటీవల జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిచి పోయిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే పోలవరం ప్రాజెక్ట్‌ గురించి తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ఎత్తు తగ్గించడం వల్ల ముంపు ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా ఉంటుందనేది కేసీఆర్‌ అభిప్రాయం. కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఏపీలో నిర్మాణం జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్‌కు తెలంగాణ సీఎం అయిన కేసీఆర్‌కు సంబంధం ఏంటీ? అసలు పోలవరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్‌ జోక్యం ఏంటీ అంటూ బాబు ప్రశ్నించాడు. కేసీఆర్‌తో లాలూచి పడి జగన్‌ ఏపీ ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు. జగన్‌ ప్రస్తుతం తెలంగాణతో గొడవ పడనక్కర్లేదు, స్నేహం అక్కర్లేదు. ఏపీలో మిగులు జలాలను సరిగ్గా వినియోగించుకుంటే పుష్కలంగా రైతులకు నీళ్లు అందించవచ్చు అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. కేసీఆర్‌ పోలవరం విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయంటూ హెచ్చరించాడు.

Exit mobile version