Site icon TeluguMirchi.com

నాపై కోపంతో జనాలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

కృష్ణ నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పలు లంక గ్రామాలతో పాటు, భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోక పోవడంతో పాటు, ముందస్తుగా ఆలోచించక పోవడం వల్లే ఈ పరిణామం ఎదురైందంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నాపై ఉన్న వ్యక్తిగత కక్ష మరియు నన్ను ఏదో చేయాలనే దురుద్దేశంతోనే జనాలను నీటిలో ముంచే పని ప్రభుత్వం చేసింది అంటూ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ విషయమై ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండి పడ్డాడు.

పై నుండి భారీగా వరుద నీరు వస్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజ్‌ గేట్లు ముందే ఎత్తేయాల్సి ఉంది. కాని నాపై ఏదో దురుద్దేశ్యంతో గేట్లు ఎత్తకుండా ఉంచారు. గేట్లు ఎత్తక పోవడంతో నీరు వెనక్కు తన్ని ముంపు ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో నీరు వచ్చిందని చంద్రబాబు నాయుడు అన్నారు. అసలు ప్రభుత్వంకు ప్రాజెక్ట్‌ గేట్లను ఎలా మెయింటెన్‌ చేయాలో తెలియదంటూ ఎద్దేవ చేశాడు. నీటిని సరిగా వినియోగించుకోవడంలో విఫలం అవ్వడంతో పాటు, ప్రతి విషయంలో కూడా జగన్‌ ప్రభుత్వం అప్పుడే విఫలం అవుతూనే ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.

Exit mobile version