ఏపీ ప్రజలు ‘రివర్స్‌ ఎన్నికలు’ కోరుకుంటున్నారు

ఏపీ సీఎం జగన్‌ తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. తాజాగా అమరావతిలో తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం నిర్వహించిన సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైకాపా నాయకులు తెలుగు దేశం పార్టీపై ఎన్ని కుట్రలు పన్ని కేసులు పెట్టినా కూడా న్యాయ విభాగం సరిగా పని చేస్తూ కాపాడుకుంటూ వచ్చిందని ఈ సందర్బంగా అన్నాడు. ఇంకా బాబు మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.

జగన్‌ పోలవరం ప్రాజెక్ట్‌కు రివర్స్‌ టెండరింగ్‌ను పిలవడంపై మండిపడ్డాడు. ఏపీ ప్రజలు వంద రోజుల్లోనే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మళ్లీ ఎన్నికలు జరిగితే బాగుండు అనుకుంటున్నారు. కాని ఇప్పట్లో ఎన్నికలు అయితే రావు కాని కేంద్రం తీసుకు రాబోతున్న జమిలి ఎన్నికల విధానం కారణంగా మూడు సంవత్సరాల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయంటూ చంద్రబాబు అన్నారు. ఆ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పడం ఖాయం అంటూ చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలపై వైకాపా నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.