కేంద్ర బడ్జెట్ లో వరాలివే…!

ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సంపదను సృష్టించడంలో మేకిన్‌ ఇండియా ప్రధాన పాత్ర పోషించిందన్న నిర్మల బడ్జెట్ లో వరాల జల్లు కురిపించారు…

  • బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు
  • దేశంలో 657 కి.మీ. మేర నడుస్తున్న మెట్రో రైళ్లు
  • వాణిజ్య అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేస్తాం
  • ఉడాన్‌ స్కీమ్‌తో చిన్న నగరాలకు విమాన సర్వీసులు
  • చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యత
  • విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి
  • పారిశ్రామిక సంస్థలు సంపద, ఉపాధిని సృష్టిస్తున్నాయి
  • సాగరమాల ద్వారా జలరవాణా మెరుగుపడుతోంది
  • గానదిలో సరకుల రవాణా నాలుగురెట్లు పెంచుతాం
  • విద్యుత్‌ వాహన వినియోగదారులకు ఇన్సెంటివ్‌లు
  • ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్లలో అనేక మార్పులు తెచ్చాం
  • రైల్వేల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రవాణా రంగం కోసం కొత్త రూపీ కార్డు
  • ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం మూడేళ్లలో రూ.10వేల కోట్లు
  • జాతీయ రహదారుల గ్రిడ్‌ ఏర్పాటు
  • పవర్‌గ్రిడ్‌ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్‌ సరఫరా
  • విద్యుత్‌ టారిఫ్‌ పాలసీలో సంస్కరణలు అవసరం
  • కోటిన్నర మంది చిరు వ్యాపారులకు పెన్షన్‌ పథకం
  • గ్యాస్‌ గ్రిడ్‌ హైవేల కోసం బ్లూ ప్రింట్‌
  • రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
  • చిన్నతరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణం
  • జీఎస్టీలో నమోదు చేసుకున్నవారికి 2శాతం వడ్డీ రాయితీ
  • చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థికసాయం కోసం రూ.350కోట్లు
  • జాతీయ హౌసింగ్‌ రెంటల్‌ విధానం
  • సెబీ పరిధిలో సోషల్‌ స్టాక్‌ఎక్చేంజ్‌ ప్రతిపాదన