కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద (పిఎంజికెపి) బీమా పథకం కింద జీవిత బీమా సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాలో భాగంగా కోవిడ్ -19 బాధ్యతలను నిర్వహించే సిబ్బందికి, ముఖ్యంగా రోగులకు ప్రత్యక్షంగా వైద్య సేవలు అందిస్తూ, ఆ వ్యాధి సోకే అవకాశం ఉన్న కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్యకర్తలు, ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లు సహా ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న సిబ్బందికి ఈ పథకం కింద వ్యక్తిగత ప్రమాదం కవర్ గా రూ. 50 లక్షలు మేరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. పైన పేర్కొన్న పథకం కింద లబ్ధి సౌకర్యాన్ని 180 రోజులకు (24.04.2021 నుంచి) పొడిగించారు.
ఈ పథకం కింద 15 జులై 2021 నాటికి మొత్తం 921మంది వైద్యులకు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రూ. 50 లక్షల చొప్పున బీమా క్లెయిమును చెల్లించారు. మహమ్మారి సమయంలో మానవ వనరుల సంక్షోభాన్ని గుర్తిస్తూ, ఆరోగ్య& కుటుంబ సంక్షేమ శాఖ వైద్య అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం రక్షణ చర్యలను మెరుగుపరచే అనేక చర్యలను చేపట్టింది.