ఇప్పుడు కొనసాగుతున్న టీకాల పంపిణీ కార్యక్రమంలో 18-44 వయోవర్గానికి కూడా కేంద్రం ప్రకటించిన ఉచిత టీకా మందు సరఫరా జరగటం లేదని మీడియాలో కొన్ని అవాస్తవాలు ప్రచారమవుతున్నాయి.
అయితే, పూర్తిస్థాయిలో కోవిడ్ టీకా మందు నేరుగా రాష్టప్రభుత్వాలు కొనుగోలుచేసిన నిల్వలేవీ బకాయి లేకుండా జూన్ 21 లోగా ఆయా రాష్ట్రాలకు అందినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రాలు కొనుగోలు చేసిన టీకామందు సమాచారం ప్రకారం మొత్తం 5.6 లక్షల డోసులు జూన్ 21 నాటికి టీకా తయారీదారులనుంచి రాష్ట్రాలకు పంపటం పూర్తయింది. అదే సమయంలో ఆ సంస్థలు భారత ప్రభుత్వ కోటా కింద అదనంగా మరో 8.8 లక్షల డోసులను ఢిల్లీకి పంపాయి. మరికొన్ని డోసులు ఈ నెలాఖరుకు అందాల్సి ఉండి. వీటిని కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు పంపుతుంది. జూన్ 22 నాటికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంకా వాడని 9.9 లక్షల టీకా డోసుల నిల్వ ఉంది.
జూన్ 21 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా డోసులు ఎలా అందాయన్నదానితో సంబంధంలేకుండా 18 ఏళ్ళు పైబడ్డవారందరికీ కోవిడ్ టీకాలు ఇస్తాయి. ఇప్పుడు అన్ని ప్రాధాన్యతా వర్గాలనూ ఏకం చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన టీకా కేంద్రాలన్నిటిలో ఉచితంగా టీకాల పంపిణీ జరుగుతుంది.