కోవిడ్ టీకా కోసం వస్తున్న పలు పుకార్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇళ్ళులేనివారిని టీకాల కార్యక్రమంలొ నమోదు చేసుకోవటం లేదంటో కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారమవుతున్నాయి. కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ వారిని తీకాలకు దూరం చేస్తున్న అపోహలకు ప్రచారం కల్పిస్తున్నారు. తప్పని సరి డిజిటల్ రిజిస్ట్రేషన్ అవసరమని, కంప్యూటర్ లో నమోదుకు తప్పనిసరిగా ఇంగ్లిష్ తెలిసి ఉండాలని , లేదా ఇంటర్నెట్ తో కూడిన  స్మార్ట్ ఫోన్ ఉండి తీరాలని తప్పుడు ప్రచారం జరుగుతోంది.

ఇవ్వనీ నిరాధారమైన తప్పుడు ప్రచారాలే. ఇందులొ ఏ మాత్రం నిజం లేదు. అందుకే ఈ దిగువ వివరణ ఇవ్వటమైంది:

1.      కోవిడ్ టీకాలు తీసుకోవటానికి సొంత మొబైల్ ఫోన్ ఉండి తీరాలన్న నిబంధన లేదు.

2.      టీకా తీసుకోవటానికి చిరునామా ధ్రువీకరణ కూడా అవసరం లేదు. 

3.      ముందుగా కొవిన్ పోర్టల్ లో నమోదు చేసుకొని తీరాలన్న నియమం కూడా లేదు

4.      వాడకందారులు సులభంగా అర్థం చేసుకోవటానికి వీలుగ కొవిన్ పోర్ట; ఇప్పుడు 12 భాషలలో అందుబాటులో ఉంది. అవి: హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒడియా బెంగాలీ, అస్సామీ, గురుముఖి (పంజాబీ), ఇంగ్లిష్ 

కోవిన్ అనేది వివిధ అంశాలను ఇముడ్చుకోగల ఒక ఐటి వ్యవస్థ.  చాలా సరళంగా అన్ని రకాల ఫీచర్లతో రూపొందింది. దేశంలోని మారుమూల ప్రాంతాలవారికి సైతం అనుగుణంగా తీర్చిదిద్దబడింది. గుర్తింపు కోసం 9 రకాల గుర్తింపు కార్డులు (ఆధార్, వోటర్ గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన రేషన్ కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు   తదితరాలు)  టీకాలకు అవసరమని చెప్పినా ఈ తొమ్మిది రకాలలో ఏదీ లేని వారు సైతం మొబైల్ ఫోన్ లేకపోయినా సరే టీకాలు తీసుకోవటానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రత్యేక ఏర్పాట్ల వలన ఇవేవీ లేని 2 లక్షలమందికి కూడా ఇప్పటిదాకా టీకాలివ్వటం జరిగింది.  వృద్ధులు, దివ్యాంగుల కోసం వాళ్ల ఇళ్లకు వీలైనంత సమీపంలో టీకా కేంద్రాలు ఉండేలా చూడాలని భారత ప్రభుత్వం 2021 మే 21న ఆదేశాలిచ్చింది.  [https://www.mohfw.gov.in/pdf/GuidanceNeartoHomeCovidVaccinationCentresforElderlyandDifferentlyAbledCitizens.pdf]

ఇంటర్నెట్ గాని స్మార్ట్ ఫోన్ గాని, చివరికి మామూలు ఫోన్ గాని అందుబాటులో లేనివారికి ఉచితంగా టీకా కేంద్రంలోనే రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఏర్పాటైంది. అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాలకు నేరుగా వెళ్ళి ఈ సౌకర్యం వాడుకోవచ్చు. ఇప్పటివరకు 80% టీకాల పంపిణీ అలా నేరుగా వచ్చి తీసుకున్నవారికి ఇచ్చినవే. కనీస సమాచారం కోసమే టీకాలిచ్చేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. స్వయంగా లబ్ధిదారు రిజిస్టర్ చేసుకోవటం కూడా సమాచారం కోసమే.

పైగా కోవిడ్ టీకాల కార్యక్రమం జాతీయ సగటు కంటే గిరిజన జిల్లాలలోనే అధికంగా ఉన్నట్టు కూడా నమోదైంది. టీకా కేంద్రాలలో 70% పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిలో 26 వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరో 26 వేల ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.