Site icon TeluguMirchi.com

20కి పైగా కొత్త రాష్ట్రాలు !

chmకొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలంటూ దేశావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లు పెరిగాయి. ఈ మేరకు  కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో  ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయా డిమాండ్లకు సానుకులంగా స్పందిస్తే భారత్లో మరో 20కి పైగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని పేర్కొంది.

ఇప్పటికే మణిపూర్లో కూకీలాండ్, తమిళనాడులో కొంగునాడు, కర్ణాటకలో తుళునాడు, ఉత్తర బెంగాల్లో కామత్పూర్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు చేస్తున్నాయని చెప్పింది. అయితే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా… అవధి ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్ఖండ్, పశ్చిమాంచల్గా విభజించాలని ఆ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్న సంగతిని ఈ సందర్బంగా కేంద్రహో మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ దేశంలోని అసోం, డార్జిలీంగ్ తదితర ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే.

Exit mobile version