నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి తన న్యూఢిల్లీ అధికారిక నివాసం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర మంత్రి కోరారు.అలానే రేపే హోంశాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురితో కూడిన కేంద్ర బృందం హైదరాబాద్ కు వచ్చి, వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి తెలంగాణలో మూడు రోజులు పాటు పర్యటిస్తారని కిషన్ రెడ్డి అన్నారు.2015 జాతీయ విపత్తుల నిర్వహణ కింద మృతుని కుటుంబానికి 4 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని, అవయవాలు కోల్పోయిన వారికి 2 లక్షలు,గాయాలపాలైన వారికి 12700,దుస్తులు-ఇంటి సామగ్రి డ్యామేజ్ కింద 3800 చెల్లిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. పంట నష్టాన్ని కూడా ఈ కేంద్ర బృందం అంచనావేసి నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర సాయం అందిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఖర్చుపెట్టి బాధితులను అదుకొంటే,కేంద్రం రీ అంబెర్స్మెంట్ చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.వర్షాల్లో కేంద్రం సహాయం చేయడం లేదని రాష్ట్ర మంత్రులు కేంద్రంపై నిందలు వేయడంకన్నా , వ్యక్తిగత విమర్శలు చేయడం కన్నా ప్రజలను ఆదుకోవడం మంచిదని కిషన్ రెడ్డి అన్నారు. వర్షాలు వరదలు పూర్తయ్యాకే సాధారణంగా కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తోంది అని, కానీ నా విజ్ఞప్తి మేరకే వర్షాల మధ్యలోనే రేపటి నుంచి కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.మూసీ కార్పొరేషన్ ఏర్పడినకా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని గత ప్రభుత్వాల హయాంలో మాదిరే నేడు చెరువులు ,కుంటలు,మూసి కబ్జాలకు గురవుతుందని, దీని పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉండాలని కిషన్ రెడ్డి అన్నారు
ప్రజలకూ దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, వరదలు వర్షాల వల్ల కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి బీజేపీ నేతలు కార్యకర్తలు ముందుండాలని అన్నారు. నేటి నుండి వారం రోజుల పాటు స్థానిక ప్రభుత్వ టీమ్స్ తో కలిసి సహాయక చర్యల్లో బీజేపీ క్యాడర్ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపిచ్చారు.