Site icon TeluguMirchi.com

నిఘా నీడలో భాగ్యనగరం

రాజధాని హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్ఆర్​) పరిధిలో పూర్తి స్థాయి భద్రతకు, పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.తారకరామారావు గారు ఇటీవల హైదరాబాద్​ మహానగరం పరిధిలో ‘పబ్లిక్​ సేఫ్టీ అండ్​ సెక్యూరిటీ’ అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్​ మహానగరం(ఓఆర్ఆర్​) పరిధిలోని ఇప్పటి వరకు సీసీటీవీ సర్విలెన్స్​ కెమెరాల ఏర్పాట్లు లేని ఇతర అన్ని ప్రాంతాల్లో పోలీసు శాఖ సమన్వయంతో నెల రోజుల వ్యవధిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సీసీటీవీ సర్విలెన్స్​ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఆదేశించింది.

ఓఆర్ఆర్​ పరిధిలో ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ(ఐటీ), ఫార్మా, సర్విస్​ సెక్టార్​ విస్తరిస్తున్న నేపధ్యంలో అందుకు అనుగుణంగా ‘పబ్లిక్​ సేఫ్టీ మెజర్స్​’లో భాగంగా భద్రతా ప్రమాణాలను మరింతగా పటిష్టపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​ ఉత్తర్వులు(జీవోనెం.167) జారీ చేశారు.

ఓఆర్ఆర్​ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ పోలీస్​ కమిషనర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్లు, గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(జీహెచ్​ఎంసీ), హైదరాబాద్​ మెట్రో రైల్​(హెచ్​ఎంఆర్​ఎల్​), సౌత్​ సెంట్రల్​ రైల్వే(ఎస్​సీఆర్​), టీఎస్​ ఆర్టీసీ, తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​(టీఎస్​ఐఐసీ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​(హెచ్​జిసీఎల్​), సెంట్రల్​ పవర్​ డిస్కమ్​(టీఎస్​ ఎస్పీడీసీఎల్​), మార్కెటింగ్​, ఇరిగేషన్​ తదితర సంబంధిత ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశనం చేసింది.

Exit mobile version