లాక్డౌన్ కారణంగా మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు.
కాగ దీనిపై మాజీ సిఏం చంద్రబాబు స్పందించారు. మద్యం దుకాణాల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర బారులుతీరడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు సరైన ప్రణాళిక లేకుండా సీఎం జగన్ వ్యవహరించటం వల్ల ప్రజల్లో భౌతికదూరం పాటించాలనే స్ఫూర్తి దెబ్బతిందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగేందుకు ఉపకరించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు.