రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణం అయ్యారని ఆరోపించారు. 13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్‌లు, స్టీల్ ప్లాంట్లు నిర్మిస్తుందా?.. మూడు రాజధానుల కడుతుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.