కరోనా జీవితంలో భాగమేనన్న సీఎం జగన్ అనాలోచిత వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఏపీలో కరోనా విస్తరించిందని ఆరోపించారు. కరోనా వ్యాప్తికి పరోక్షంగా వైకాపా నేతలే కారణమంటూ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ రాశారు.
కరోనా ప్రారంభదశలో ఉన్నప్పుడు ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రైతులు, కార్మికులు, వలస కూలీలు లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం పట్టుంచుకోవటంలేదన్నారు. కరోనా జీవిద్దాం, జీవితంలో అంతర్భాగమే అన్న సీఎం వ్యాఖ్యలు షాక్ లోకి నెట్టాయని అన్నారు.