డాక్టర్ మేటర్ లోకి ఎంటరైన చంద్రబాబు


నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ను.. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పలు రకాల అభియోగాలతో కేసులు నమోదు చేసింది. ఈ సుధాకర్.. రెండు రోజుల కిందట.. కరోనా వ్యాప్తి చెందుతున్నా వైద్యులకు కనీసం మాస్కులు, గ్లౌజులు లాంటి పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు లాంటివి ఇవ్వలేదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దింతో ఆగ్రహించిన ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది.

కాగా డాక్టర్‌ ధాకర్‌ సస్సెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇలాంటి చర్యతో ఇతర వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో మనోధైర్యం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు. రక్షణ పరికరాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న ఆవేదననే సుధాకర్‌ వెల్లడించారని తెలిపారు.