Site icon TeluguMirchi.com

తమిళనాడు సీఎంకి చంద్రబాబు లేఖ

తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. తమిళనాడులో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు చెందిన 1500 మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన కారణంగా భనవ నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలు అందించాలని కోరారు.

కాగ, భారత్ లో కరోనా వైరస్ తీవ్రత మరింత పెరిగింది. కేసుల పెరుగుదల ఎన్నడూ లేనంతగా 24 గంటల్లో 1,463 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 29 మంది మరణించారు. కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ఈ సాయంత్రం 5 గంటల సమయానికి భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 10,815గా నమోదైంది.

Exit mobile version