రేపు ఉగాది సందర్బంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో ఉగాది వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఆ సందర్బంగానే ఈ దృష్యం మీడియా కంట పడింది. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు ఇచ్చిన ఇద్దరు సీఎంల మద్య కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూర్చుని ఉండగా, వీరి ముగ్గురికి అభివాదం చేస్తూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముందుకు సాగాడు.
ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రా ముఖ్యమంత్రులు ముచ్చటించుకుని, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ పలువురు నాయకులతో సరదాగా ముచ్చటించి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గవర్నర్ నిర్వహించిన ఈ వేడుక బాగుందని వచ్చిన ఆహ్వానితులు మరియు రాజకీయ ప్రముఖులు అన్నారు.