ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : చంద్రబాబు

CBN-demands-Kiran-resignationధర్మాన వ్యవహారంలో గవర్నర్ ఫైలు వెనక్కి పంపినందుకు ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోసం ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటామని హామి ఇచ్చారు.